అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

గొల్లపల్లి, వెలుగు: చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, వాటి బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లె గ్రామంలో నిర్మించిన అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను ఆయన సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రతి చిన్నారికి మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తోందన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. ఏఎంసీ చైర్మన్ సంతోష్, సర్పంచులు జలంధర్, భవాని, ఉపసర్పంచులు సాయిరావు, రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగన్న, లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిశాంత్ రెడ్డి పాల్గొన్నారు.